ఇరాన్‌లోని తమ ఉద్యోగులు వెనక్కి రప్పిస్తున్న రష్యా
ఇరాన్‌లోని బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై దాడి జరిగిన నేపథ్యంలో రష్యా అప్రమత్తమైంది. ఆ ప్లాంట్‌లో పని చేస్తున్న తమ దేశానికి చెందిన 163 మంది ఉద్యోగులను వెనక్కి రప్పిస్తుంది. ఈ ప్లాంట్ మాస్కో పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతోంది. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ కార్యకలాపాలను తగ్గించింది. తాజాగా దాడి నేపథ్యంలో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది.