హిందూపురంలో బాలకృష్ణ కొత్త ఇంటికి భూమి పూజ
సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు తన కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరై బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు బాలకృష్ణ ఇక్కడ ఇంటి నిర్మాణం చేపట్టారని నేతలు తెలిపారు.