పులివెందులలో రేపు విద్యుత్ అంతరాయం
KDP: పులివెందులలోని 33/11 కేవీ లైన్లకు సంబంధించి మరమ్మతు పనులు చేపట్టనున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ రమేశ్ తెలిపారు. నల్లపురెడ్డిపల్లి, ఈ కొత్తపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు, అలాగే వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వెల్లడించారు.