జలధార పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జలధార పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

అన్నమయ్య: చౌడేపల్లి మండలంలో జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులకు ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించి, చెరువుల అనుసంధానం, డీసిల్టేషన్, ఫీడర్ ఛానళ్ల పనులు మాన్సూన్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. 243 ఎంఐ ట్యాంకులను సమగ్రంగా అభివృద్ధి చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని తెలిపారు.