పేపర్ గ్లాసులను ఉపయోగించరాదు: కమిషనర్

KDP: హానికరమైన పేపర్ గ్లాసులను ఉపయోగించరాదని మున్సిపల్ కమిషనర్ రాముడు పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలోని టీ, కాఫీ షాపులను ఆయన వార్డు సచివాలయ సెక్రటరీలతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు నాణ్యమైన ఐఎస్ఐ మార్క్ కలిగిన కాఫీ, టీ పొడులనే వాడాలని షాపు యజమానులకు సూచించారు. ఈ సమీక్షలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.