వసతి గృహాలను సందర్శించిన సీపీఐ నాయకులు
BHNG: వసతి గృహాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని బాలుర వసతి గృహాన్నిCPI నాయకుల బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో మరుగుదొడ్లకు ఏర్పాటు చేసిన తలుపులు విరిగి ఉండడాన్ని గమనించారు.