పెద్ద చెరువు కట్టకు గండి.. స్పందించిన అధికారులు

MHBD: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. డోర్నకల్ మండలం వెన్నారం పెద్ద చెరువు కట్టకు గండి పడగా, సోమవారం ఇరిగేషన్ ఏఈలు కిషన్, హార్దిక్ పరిశీలించి, జేసీబీ సాయంతో మరమ్మతులు చేయించారు. కట్ట తెగితే ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామం మునిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.