నేడు తొర్రూరుకు మంత్రి కొండా సురేఖ రాక
MHBD: ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా తొర్రూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 1:00 గంటలకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. అనంతరం జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రసంగించనున్నారు.