మన ఏయూ.. మన వైభవం..!
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో భాగంగా జిమ్నాజియం మైదానంలో నిర్వహించిన హ్యూమన్ స్పెలౌట్ కార్యక్రమం ఆకట్టుకుంది. ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు కలిసి ‘AU@100’ ఆకారాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ.. శతాబ్ది వేడుకలను అందరూ భాగస్వామ్యంతో విజయవంతం చేయడం అభినందనీయమన్నారు.