నూడిల్స్‌లో బొద్దింక కలకలం
ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో నూడిల్స్ తినడానికి వెళ్లిన స్థానిక వ్యక్తి మండ్యగురు జగదీష్‌కి చేదు అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేసిన నూడిల్స్‌లో బొద్దింక కనిపించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పరిశుభ్రతా లోపాలు వినియోగదారుల ఆరోగ్యానికి హానికారకమని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు ఇకపై జరగకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.