హైకోర్టు సీజే పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన
VSP: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పరిశీలించారు. ఎండాడలో నిర్మించనున్న జ్యుడిషియల్ బిల్డింగ్ శంకుస్థాపన స్థలాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.