ఆటోను ఢీకొన్న కారు.. మహిళ మృతి

ఆటోను ఢీకొన్న కారు.. మహిళ మృతి

 అనంతపురం: కూడేరు మండలం కమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ఘటనలో సరస్వతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రాజు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు.