ప్రతి ఒక్కరు సేవ చేయడం అలవర్చుకోవాలి: మాజీ ఎంపీపీ
SS: గోరంట్లలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలువురు పేదలకు బుధవారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోరంట్ల మండలం మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చలి తీవ్రత దృష్ట్యా దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సేవ చేయడం అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కమలా బాయి పాల్గొన్నారు.