స్కూల్ మూసివేయడంపై ఆగ్రహం

కర్నూలు: మహానంది మండలం గాజులపల్లె ఆర్ఎస్ చెంచు కాలనీలోని ఏకోపాధ్యాయ పాఠశాలను ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో పాఠశాల మూసివేయడంతో టీచర్ సుమంత్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం చెంచుగూడెంలో పర్యటించి పాఠశాల పనితీరుపై ఆరా తీశారు.