గుల్లపేట సర్పంచ్‌గా పడిగెల శంకర్ రెడ్డి
JGL: జగిత్యాల రూరల్ మండలంలోని గుల్లపేట సర్పంచ్‌గా పడిగెల శంకర్ రెడ్డి తన సమీప అభ్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందాడు. దీంతో గ్రామంలో శంకర్ రెడ్డి అభిమానులు, గ్రామ నాయకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. గ్రామ సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వచ్చిన తనను గెలిపించిన ప్రజలకు శంకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.