VIDEO: సక్కుబాయి లేఔట్‌లో ఆక్రమణలపై హైడ్రా విచారణ
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట విలేజ్‌లోని సక్కుబాయి లే ఔట్‌లో ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలపై హైడ్రా విచారణ చేపట్టింది. హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సొసైటీకి చెందిన వారితో పాటు షేక్ పేట విలేజ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.