'వక్ఫ్ బోర్డు భూముల సేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలి'
ATP: వక్ఫ్ బోర్డు కార్యాలయం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ అభ్యంతరకరంగా ఉందని వైసీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు మొఘల్ సైఫుల్లా బేగ్ పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు భూముల సేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని కలెక్టర్ ఆనంద్‌కు వారు వినతి ఇచ్చారు. గుంటూరులోని అంజుమన్ సొసైటికీ చెందిన 71.57 ఎకరాల భూమిని ప్రవేట్ వ్యక్తులకు అప్పగించరాదన్నారు.