కొమిరిలో చేతి పంపును ఏర్పాటు చేసిన పీటర్ పాల్
VZM : మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు సురక్షితమైన తాగునీటి సౌకర్యం అందించే ఉద్దేశ్యంతో బేతని మిషన్ సొసైటీ యొక్క "Safe Water for All” ప్రాజెక్టు ఆధ్వర్యంలో జిల్లాలోని కొమిరి గ్రామంలో చేతి పంపును ఏర్పాటు చేశారు. దీనిని ఆ సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ చేపా పీటర్ పాల్ శనివారం ప్రారంభించారు. త్వరలో మరిన్ని గ్రామాలకు సురక్షిత నీటిని అందిస్తామని ఆయన పేర్కోన్నారు.