'మైనర్లకు బైక్ ఇస్తే కఠిన చర్యలు తప్పవు'

'మైనర్లకు బైక్ ఇస్తే కఠిన చర్యలు తప్పవు'

VKB: కొడంగల్ మండలం చిన్న నందిగామలో సర్పంచ్ దత్తాత్రేయ రావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సోమవారం సదస్సు నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఈ సందర్భంగా గ్రామసభలో కీలక తీర్మానం చేశారు. పోలీస్ అధికారి రమేష్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అరుణ, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.