దేవరకొండలో ప్రతిపక్ష, బీసీ నాయకుల ముందస్తు అరెస్టు

దేవరకొండలో ప్రతిపక్ష, బీసీ నాయకుల ముందస్తు అరెస్టు

NLG: సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో దేవరకొండలో బీజేపీ, బీఆర్ఎస్, బీసీ సంఘాల నాయకులను పోలీసులు శనివారం ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎంకు ప్రతిపక్ష నేతలను చూస్తేనే భయం పట్టుకుందని అరెస్ట్ అయిన నాయకులు విమర్శించారు. వెనుకబడిన దేవరకొండకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.