చెరువులో పడి మహిళ మృతి

NGKL: బిజినేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గుంపాల లక్ష్మమ్మ(48) బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లి కనిపించకపోవడంతో కుమారుడు అశోక్ వెతికే క్రమంలో నేడు పాలెం చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించాడు. ఘటనపై కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.