కేయూలో ఆరుగురు విద్యార్థుల సస్పెండ్?
HNK: కేయూలో ఎంఎస్సీ (ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై వర్సిటీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై నియమించిన కమిటీ రిపోర్ట్ ఆధారంగా కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విభాగాలకు చెందిన మొత్తం ఆరుగురు విద్యార్థులపై ఒక సెమిస్టర్ పాటు సస్పెన్షన్ విధించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించినట్లు సమాచారం తెలియజేశారు.