పెదపారుపూడిలో కోటిసంతకాల ప్రజాఉద్యమం

పెదపారుపూడిలో కోటిసంతకాల ప్రజాఉద్యమం

కృష్ణా: పెదపారుపూడి యలమర్రులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు కోటిసంతకాల ప్రజాఉద్యమం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు కలిగే నష్టాలను ఇంటింటికీ వెళ్లి నాయకులు, కార్యకర్తలు వివరించారు. అనంతరం స్థానికుల నుంచి సంతకాలను సేకరించారు. గ్రామస్తులు ఉద్యమానికి స్పందించి మద్దతు తెలిపారు.