ఎమ్మెల్యే లలిత కుమారి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు

ఎమ్మెల్యే లలిత కుమారి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు

VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎల్.కోటలోని ఆమె స్వగృహంలో రక్షాబంధన్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పార్టీలో పలు క్యాడర్‌లో గల నాయకులకు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులకు ఆమె రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సోదర భావం, ప్రేమానురాగాలతో ఉండాలని ఆకాంక్షించారు.