'పరిశోధన తర్వాత దోషులపై చర్యలు తీసుకుంటాం'
MHBD: గూడూరు మండలం పొనుగోడు, చిర్రకుంటతండా గ్రామాల్లో నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతుల ఫిర్యాదుపై కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు స్పందించి మంగళవారం వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా AEO మాలిక్ పంట నమూనాలు సేకరించామని తెలిపారు. పంట నమూనాలను HYD ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి పంపి, పరిశోధన తర్వాత దోషులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.