14 ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత: MP
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని సుమారు 14 ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు MP కడియం కావ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయాలతో పాటు పార్కులు, పర్యాటక ప్రాంతాలను సుందరీకరించి వరంగల్‌ను అంతర్జాతీయ పర్యాటక చిత్రపటంలో నిలబెడతామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.