రేపు జిల్లాలో NMMS పరీక్ష: DEO

రేపు జిల్లాలో NMMS పరీక్ష: DEO

KMR: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్లు కామారెడ్డి DEO రాజు తెలిపారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 6 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి పరిధిలో 4 కేంద్రాలు, బాన్సువాడ పరిధిలో 2 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.