మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

వరంగల్: తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ భగ్గుమంటోంది. జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మరో మూడు రోజులపాటు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతల నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని పేర్కొన్నారు.