ఐదు లక్షల కంటి శస్త్రచికిత్సలు పూర్తి చేసిన ఫౌండేషన్
విశాఖపట్నంలోని శంకర్ ఫౌండేషన్ కంటి వైద్య సేవల్లో కీలక మైలురాయిని చేరుకుంది. 1997 నుంచి ఇప్పటివరకు 5 లక్షలకు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ ఏడాదిలో ఉచిత శిబిరాల ద్వారా వేలాది మందికి స్క్రీనింగ్ చేసి, పలువురికి విజయవంతంగా ఆపరేషన్లు నిర్వహించినట్టు డిప్యూటీ జీఎం కె. బంగార్రాజు తెలిపారు.