ఎరువుల సమతుల్య వినియోగంపై అవగాహన

ఎరువుల సమతుల్య వినియోగంపై అవగాహన

PLD: ఎరువుల సమతుల్య వినియోగంపై నరసరావుపేట, రావిపాడులో వ్యవసాయ శాఖ అధికారులు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గొర్రెల ఫెన్సింగ్ విధానం వల్ల నేలలో సహజ పోషకాలు పెరుగుతాయని శాస్త్రవేత్త డా. ఎం.గంగాదేవి, ఎంఏవో శాంతి తెలిపారు. ఒక ఎకరంలో 250 గొర్రెలను 5 రోజులు ఉంచితే 70-80% భూమికి పోషకాలు లభిస్తాయని చెప్పారు. దీంతో నేల ఆరోగ్యంగా ఉంటుందన్నారు.