రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సామేలు

రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సామేలు

భువనగిరి: మోత్కూరు మండలం ముసిపట్ల గ్రామంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ఎమ్మెల్యే మందుల సామేలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలన్నారు. వారి వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ గుర్రం కవితలక్ష్మీనరసింహారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.