మాక్ డ్రిల్స్‌పై ముగిసిన హోంశాఖ సమావేశం

మాక్ డ్రిల్స్‌పై ముగిసిన హోంశాఖ సమావేశం

రేపటి సివిల్ మాక్ డ్రిల్స్ ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమావేశం ముగిసింది. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రేపు రాష్ట్రాల్లో నిర్వహించే మాక్ డ్రిల్స్ ఏర్పాట్లపై చర్చించారు. 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ ఉండనున్నాయి. వైమానిక దాడుల హెచ్చరిక, సైరన్ల అమలు, పౌరులు స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించాలని రాష్ట్రాల అధికారులకు హోంశాఖ సూచించింది.