'పాత బాన్సువాడ సహకార సంఘానికి అభినందలు'
KMR: పాత బాన్సువాడ వ్యవసాయ సహకార సంఘం రాష్ట్ర ఉత్తమ వ్యవసాయ సహకార సంఘంగా అవార్డు పొందిన సందర్భంగా బాన్సువాడలో అభినందన సభ జరిగింది. నాయిని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ సభను ఏర్పాటు చేశారు. సహకార సంఘం ఛైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డిని నాయిని బ్రాహ్మణ సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించి, అవార్డు సాధించినందుకు సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.