ప్రపంచంలో అత్యంత ఎత్తైన రాముని విగ్రహం
గోవాలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే ఎత్తైన 77 అడుగుల భారీ శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. గోకర్ణ పర్తగాలీ మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మఠంలో ఆలయాన్ని కూడా మోదీ దర్శించుకున్నారు. కాగా, ఈ విగ్రహాన్ని చెక్కింది 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' ఫేమ్ రామ్ సుతార్ కావడం విశేషం.