నూజివీడులో 12 సబ్సిడీ సిలిండర్స్ సీజ్
ELR: నూజివీడు పట్టణంలోని ఓ స్వీట్ హోమ్‌లో విజిలెన్స్ ఎస్సై రంజిత్ కుమార్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించి 12 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.27,258 ఉంటుందన్నారు. యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.