రేపు పెళ్లి అనగా.. వరుడు జంప్

రేపు పెళ్లి అనగా.. వరుడు జంప్

HNK: పెళ్లికి మరో రెండు రోజులు ఉందనగానే పెళ్లి కూమారుడు పరారైన ఘటన  కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ యువకుడికి పెళ్లి కుదరగా రూ. 26 లక్షలు కట్నం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అదనపు కట్నం కోరుతూ ఇంటి నుంచి వెళ్లిన వరుడు తిరిగి రాకపోవడంతో యువతి తల్లిదండ్రులు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.