కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘం ధర్నా

ADB: సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్ 42 శాతంకు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలన్నారు.