ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
JGL: భీమారం మండలం గోవిందారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. ఉదయం వేళ గ్రామస్తులు ప్రత్యేకంగా దేవాలయంలో పూజలు చేశారు. భక్తజన సందడిలో స్వామి వారి కళ్యాణం జరిపించారు. ఈ ఉత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.