VIDEO: పాలకుర్తిలో యూరియా కోసం రైతుల అవస్థలు

JN: పాలకుర్తి మండల కేంద్రంలో శుక్రవారం యూరియా బస్తాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు సహకార సొసైటీ వద్ద ఉదయం నుంచి క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడుతున్నారు. పాదరక్షలు పెట్టి నిరీక్షిస్తున్న రైతులకు ఒక్కొక్కరికి ఒక బస్తా మాత్రమే ఇస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలని కోరారు.