నరసరావుపేటలో పారిశుద్ధ్య పనుల పరిశీలన

నరసరావుపేటలో పారిశుద్ధ్య పనుల పరిశీలన

PLD: నరసరావుపేటలోని పలు వార్డులలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీ కాలువల మరమ్మతుల పనులను తనిఖీ చేసి, త్వరగా మొదలుపెట్టిన పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వార్డులోని ప్రజలను కలిసి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు పట్టణంలో పర్యటిస్తానని, ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు.