ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు: WGL ట్రాఫిక్ పోలీసులు
WGL: థ్రిల్ కోసం వేగం పెంచి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని WGL ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రోడ్లు ఖాళీగా ఉన్నాయని స్పీడ్‌గా వెళ్లి ప్రమాదాలను స్వాగతించవద్దని వారు కోరారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ఇతరులను ఇబ్బంది పెట్టొద్దని, కుటుంబ సభ్యుల కోసమైనా సురక్షితంగా గమ్యం చేరుకోవాలని పోలీసులు విజ్ఞప్తిచేశారు.