2రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోనున్న సీలేరు జలవిద్యుత్ కేంద్రం

2రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోనున్న సీలేరు జలవిద్యుత్ కేంద్రం

అల్లూరి: సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం మరో 2రోజుల్లో నిర్ధేశించిన విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని చేరుకోనుంది. సీలేరు జలవిద్యుత్‌ కేంద్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 478 మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి చేయాల‌ని సెంట్రల్‌ విద్యుత్‌ అథారిటీ లక్ష్యంగా నిర్ణయించగా బుధ‌వారం నాటికి 471.23 మిలియ‌న్ యూనిట్లు ఉత్ప‌త్తి చేసింది. మ‌రో 2 రోజుల్లో ల‌క్ష్యం చేరుకునే అవకాశం ఉంది.