ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి అమ్మవారు
PLD: వాసవి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు పిడుగురాళ్ల పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి అమ్మవారు ప్రత్యేక గాజులతో సుందరమైన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భారీ సంఖ్యలో మహిళలు ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలు నిర్వహించారు.