పొంచి ఉన్న ప్రమాదం.. పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

పొంచి ఉన్న ప్రమాదం.. పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

SRPT: అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో రహదారి ప్రక్కనే ఉన్న విద్యుత్ నియంత్రిక ట్రాన్స్ ఫారం స్థానికులకు ప్రమాదకరంగా మారింది. చుట్టూ రక్షణ కంచె లేకపోవడంతో మూగ జీవులు, ప్రజలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. శుక్రవారం స్థానికులు మాట్లాడుతూ.. వెంటనే సంబంధిత అధికారులు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.