జలుమూరు మండల వైసీపీ కమిటీ కార్యదర్శిగా రంగారావు

SKLM: వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో నియోజకవర్గ, మండల కమిటీల కార్యదర్శుల నియామకం జరిగింది. ఈ మేరకు గురువారం రాత్రి జలుమూరు మండల కమిటీ కార్యదర్శిగా రంగారావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రంగరావు శుక్రవారం ఉదయం జలుమూరులో మాట్లాడుతూ.. తనకు ఈ పదవి అప్పగించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్యలకు కృతజ్ఞతలు తెలిపారు.