పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

NLG: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నేలబారిపోయిన పంట పొలాలను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. నియోజవర్గంలోని పలు గ్రామాలలో గురువారం నెలకొరిగిన వరి పంటను నేరుగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొంథా తుఫాన్ దాటికి పడిపోయిన పంటపొలాల వివరాలను అధికారులు సర్వే చేసి సేకరించాలని కోరారు.