'సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలి'

WGL: స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలో నిర్వహించిన సీపీఎం జిల్లా స్థాయి వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ మేరకు తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్లు, కుక్కలు, కోతుల బెడద వంటి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం పోరాడాలని పార్టీ నాయకులకు సూచించారు.