సెంట్రల్ యూనివర్సిటీ వీసీతో ఎంపీ సమావేశం
ATP: బుక్కరాయసముద్రం మండలంలోని సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ముందుగా యూనివర్సిటీలో ఎంపీ మొక్కలను నాటారు. అనంతరం యూనివర్సిటీలో వివిధ సమస్యల పైన వైస్ ఛాన్స్‌లర్‌తో చర్చించి, విద్యార్థులకు మంచి విద్యను అందించాలన్నారు.