ఆక్రమణలు తొలగించిన అధికారులు

ఆక్రమణలు తొలగించిన అధికారులు

HNK: గోపాల్‌పూర్, దేవరాజ్ కాలనీ, శివ సాయి కాలనీలలో రోడ్లను ఆక్రమించి నిర్మించిన మండపాలను మున్సిపల్ అధికారులు జేసీబీతో ఇవాళ తొలగించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల మేరకు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు తప్పవని ఇంఛార్జ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రశాంత్ హెచ్చరించారు.