'నీటి కొరత లేకుండా చూడాలి'
ప్రకాశం: ఎర్రగొండపాలెం అంబేద్కర్ నగర్ లో జల సురక్ష మాసం సేవ్ వాటర్ మంత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరై, రెగ్యులేటర్ ట్యాంక్ ను ఎక్కి ట్యాంకు పరిశుభ్రత, పరిసరాలను పరిశీలించారు. నీటిని పొదుపుగా వాడి భవిష్యత్తులో ఎటువంటి కొరత లేకుండా ఉండేలా బాధ్యత తీసుకోవాలని అధికారులకు సూచించారు.